
పయనించే సూర్యుడు జనవరి 19 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని పట్టణం నందు మాన్వి దేవేంద్రప్ప కార్యాలయం నందు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ, కురుమ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఈ సందర్బంగా దేవేంద్రప్ప మాట్లాడుతూపార్టీ పెట్టిన 9నెలల్లోపే ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీఆర్ ది .ఎన్టీఆర్ ను మించిన నాయకుడు, నటుడు మరొకరు లేరు, రాలేరు బడుగు, బలహీన వర్గాలను చట్ట సభలకు పంపిన నాయకుడు ఎన్టీఆర్ 2రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చి.. సంక్షేమ పథకాలకు నాంది పలికారు ఎన్టీఆర్ మరణం తర్వాత కష్టకాలంలో చంద్రబాబు ఆ బాధ్యతలు తన మీద వేసుకున్నారు ఆ రోజు నుంచి నేటి వరకు పార్టీని ఎన్నో మెట్లు ఎక్కించారు.కోటి సభ్యత్వాలు దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేవునారా లోకేష్ ఆధ్వర్యంలో సభ్యత్వాల నమోదులో రికార్డు సృష్టించాం. కార్యకర్తల జీవితానికి భరోసా ఇచ్చేలా సభ్యత్వాల నమోదు ఉంది. ఇదంతా ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టడం వలనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు &తదితరులు పాల్గొన్నారు