పయనించే సూర్యుడు 19-1-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30 వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది అన్న నందమూరి తారక రామారావు సినిమా జీవితంలో 50 దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజుగా సినిమా పరిశ్రమను ఏలినాడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ తెలుగు ప్రజలను పట్టి వారి వ్యవస్థలతో హింసలకు గురి చేయడం పేదవాడికి పట్టెడు అన్నం మెతుకులు కూడా ఇవ్వని ఆనాటి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న తీవ్రమైన అన్యాయాలను చూసి చలించి నా తెలుగు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుందా అని ఆవేదనతో ఆక్రోషముతో ఆక్రందనతో స్పందించిన మహానేత ఎన్టీఆర్ 1982లో తన సినీ మా జీవితానికి స్వస్తి పలికి ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో 1982 మార్చి 29వ తేదీన తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స లో తెలుగుదేశం పార్టీని స్థాపించి విరామం అనేది లేకుండా తెలుగు నేల మొత్తం చైతన్య రథం మీద పర్యటించి ప్రజలను చైతన్యవంతులు చేసి ముఖ్యంగా ఆనాడు రాజకీయాలకు అంటరాని వారిగా మిగిలిన బీసీ.. ఎస్సీ.. ఎస్టి.. ఆర్యవైశ్య సమాజాన్ని చైతన్యపరిచి 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోని అత్యున్నతమైన రాష్ట్రంలో తీర్చిదిద్దినాడు పేద ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఆనాటి పటేల్ పట్వారి వ్యవస్థలను సరమగీతము పాడి ప్రజల ముంగిట్లోకి పరిపాలన తెచ్చిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ 1982 ముందు ప్రజలకు బియ్యం అంటే తెలవని పరిస్థితులలో రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన మహానుభావుడు ఎన్టీఆర్ పేద ప్రజలకు సగం ధరకే జనతా వస్త్రాలు మరియు 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు రైతులకు అందించిన రైతు పక్షపాతి పేద ప్రజలకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిన అన్న ఎన్టీఆర్ అలాగే మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన ఆడపడుచుల అన్న గా నిలిచిన మహోతేజ మూర్తి ఎన్టీ రామారావు ప్రతి గ్రామానికి ప్రభుత్వ పాఠశాలల నిర్మించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఉచిత విద్యను అందించిన విద్యా నేత ఎన్టీఆర్ గ్రామాలలో అంగన్వాడీ స్కూల్స్ పెట్టించిన మహా ఘనుడు ప్రతి పల్లెటూరుకు ఆర్టీసీ బస్సులను నడిపించి ప్రజలకు సులభమైన ప్రయాణాన్ని అందించిన ఎన్టీఆర్ ప్రతి గ్రామానికి జిల్లాకు అనుబంధము చేసి తారు రోడ్లు ఏపించి ప్రజలకు పట్నాల బాట పట్టించిన మహా నాయకుడు మండల మండల వ్యవస్థను స్థాపించిన నేత ప్రతి గ్రామములో ప్రజలు సురక్షితమైన నీరు త్రాగాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో బావులు తవ్వించి ట్యాంకులు కట్టించి పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేయించిన అపర భగీరథుడు ఎన్టీఆర్ రాజకీయాలలో 1982 కు ముందు 50 సంవత్సరాల పాటు పరిపాలించిన సర్పంచులను చూసి ప్రజలు విసిగించుకున్న సందర్భంలో రిజర్వేషన్లను పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను సర్పంచులుగా మరియు మండల అధ్యక్షులుగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించి మహా నేతలుగా తీర్చిదిద్దినాడు వారినే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పార్లమెంటు సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా చేసినాడు ఈనాడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ అనే స్కూల్లో చదువుకున్న వారే తెలుగుదేశం పార్టీకి గర్వకారణం ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు కొత్తగా ఏర్పడిన తెలంగాణ లో రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మొనగాడు ఎన్టీఆర్ నేటికీ తెలంగాణలో రోడ్ల సౌకర్యం అయితేనేమి మంచినీటి సౌకర్యం అయితేనేమి రాజకీయ రిజర్వేషన్లు అయితేనేమి రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి పింఛన్ల పథకం అయితే నేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితే నేమి అది తెలుగుదేశం మార్క్ ఇప్పటికీ కనిపిస్తుంది ఈ చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణలో తెలుగుదేశాన్ని ఎవరు మరిచిపోరు రాజకీయ చైతన్యానికి మరో పేరు అన్నా ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని గుర్తించాలి . మహిళల్లో ఇంత చైతన్యం రావడానికి కారణం ఎన్టీఆర్ తెలుగు ప్రజల బ్రాండ్ ఒక ఎన్టీఆర్ కి చెందుతుంది తప్ప ఇతర నాకు ఎలాంటి అవకాశం లేదు ఎన్టీఆర్ 30 వ వర్ధంతిని జరుపుకోవడం మహానేతకు నివాళులర్పించడం తెలుగు ప్రజలకు దక్కిన అద్భుతమైన గౌరవమైన పేర్కొంటున్నాం.. ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వారు. ఓరగంటి భార్గవ రామ్. తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు గర్వందుల రవి గౌడ్ తెలుగుదేశం పార్టీ గొల్లపల్లి మండల శాఖ అధ్యక్షులు మరియు రాగల శంకర్ రజక కందుకూరి తిరుపతి సాన స్వామి కొప్పుల స్వామి నందు తదితర అభిమానులు పాల్గొనడం జరిగినది.