నేతకాని వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీకే మద్దత

పయనించేసుర్యడు, జనవరి19, రామగుండం మండలం (విద్యాసాగర్):మున్సిపల్ ఎన్నికల్లో నేతకాని వర్గానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించే పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నేతకాని జేఏసీ నాయకుడు దుర్గం నగేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో నేతకాని సామాజిక వర్గానికి జనాభా, ఓటు బలం మేరకు కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు నేతకాని వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, ఎన్నికల్లో ప్రతినిధిత్వం ఇవ్వడంలో తీవ్ర వివక్ష చూపుతున్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా, కార్పొరేషన్, మున్సిపాలిటీలో నేతకాని వర్గానికి గణనీయమైన ఓటర్లు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే వాడుకొని, ఎన్నికల అనంతరం పక్కన పెట్టే ధోరణిని ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు.రాబోయే కార్పొరేషన్/ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ బిజెపి సహా అన్ని రాజకీయ పార్టీలు నేతకాని వర్గానికి సముచిత సంఖ్యలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయితే నేతకాని వర్గానికి న్యాయం చేస్తూ టికెట్లు కేటాయిస్తుందో, ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నేతకాని సంఘాలన్నీ ఏకతాటిపై నిలబడి సంపూర్ణంగా మద్దతు ఇస్తాయని తెలిపారు.