పయనించే సూర్యుడు 19 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న)విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ,పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను పాలకుర్తి నియోజకవర్గం పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల పార్టీ అధ్యక్షులు గజ్వేల్లీ వెంకన్నమాట్లాడుతూ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేదలకు స్వేచ్ఛ స్వతంత్యాలు లభించాయన్నారు. ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ వెనుకబడిన వర్గాల వారికి రాజకీయాలలో అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక చరిత్ర అయితే , తన పాలన దక్షతతో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి పేదల దేవుడుగా ఎన్టీఆర్ కీర్తించబడ్డాడన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం , మండల వ్యవస్థ ఏర్పాటు చేయడం , ఆడపిల్లకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని తీసుకురావడం లాంటి పథకాలు నేటికీ కొనసాగుతూ ఉన్నాయంటే అదే ఎన్టీఆర్ గొప్పతనం అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని , తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పెద్ద వంగర అడక్కు కమిటీ మెంబర్ బయ్యన బిక్షపతి పాలకుర్తి మండల మండల నాయకులు రమేష్ ఎల్లయ్య , ఉపేందర్ రామ్ రెడ్డి నేతలు తదితరులు పాల్గొన్నారు