
పయనించే సూర్యుడు జనవరి 19 ఎన్టీఆర్ జిల్లా /జగ్గయ్యపేట నియోజకవర్గం యువత క్రీడలలో రాణించాలి,నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో జరిగే షటిల్ టోర్నమెంట్ ప్రారంభించిన తన్నీరు నాగేశ్వరావు జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామం షటిల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్బంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత ఆర్థికంగా నష్టపోయే చెడు ఆటలు తదితర క్రీడలకు దూరంగా ఉండాలని, షటిల్, క్రికెట్, బాల్ బాడ్మింటన్, కబడ్డీ తదితర ఆరోగ్యకరమైన ఉన్నత క్రీడలలను నేర్చుకొని మంచి మార్గంలో నడవాలని కోరారు,క్రీడలను ప్రోత్సహించి యువకులకు అండగా ఉండే విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుగానే ఉంటుందని తెలిపారు,ఈ షటిల్ టోర్నమెంట్ లో 43 టీమ్స్ పైగా పాల్గొనడం పట్ల టోర్నమెంట నిర్వాహకులకు,టోర్నమెంట్ ఫ్రైజ్ మణి స్పాన్సర్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి నాగేశ్వరరావు, .గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శివరాత్రి పృథ్వి రాజ్, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, జిల్లా బిసి సెల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు డేరంగుల శ్రీనివాసరావు, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు మండల యూత్ అధ్యక్షులు షాబుద్దీన్, కోయ బాబీ, మండల పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు బక్క వెంకట్ రెడ్డి, మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు నల్లబోతుల వెంకటేష్, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బొడ్డు రవి, మండల వాలంటీర్ విభాగం అధ్యక్షులు గజేం నాగేంద్ర, పట్టణ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ళ సురేష్ , గ్రామ యూత్ అధ్యక్షులు మల్లెబోయిన సైదులు , గ్రామ ప్రధాన కార్యదర్శి బొజ్జా సాయి, ఇటూరి వెంకట్, మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి కొణతం నాగేంద్ర, గ్రామ సోషల్ మీడియా అధ్యక్షులు దార గౌతమ్, గ్రామ ఎస్సి సెల్ అధ్యక్షులు చింతమాల రాంబాబు ,నల్లబోతుల ఎల్లేశ్వరావు,కొలిపాక గోపి, కొణతం శివ, తూము గోపి,కలక సురేష్ , కొలుసు సాయి, గుర్రాల గోపి, బన్ను, బోసు , భూక్యా రాము ,తదితరులు పాల్గొన్నారు.