పేదలకు భోజనం పొట్లాలు పంపిణీ

పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 19: ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ బి.సునీల్ తల్లి బాలిపోగు వెంకటసుబ్బమ్మ నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని గ్రాండ్ మాస్టర్ సునీల్ ఆధ్వర్యంలో ఆదివారం రాజంపేట పట్టణంలోని రైల్వే స్టేషన్, సబ్ కలెక్టర్ కార్యాలయం మరియు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని నిరాశ్రయులు, పేదలు, బిక్షకులకు భోజన పొట్లాలు పంపిణీ చేశారు చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తన తల్లి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలోనే ఆత్మసంతృప్తి ఉంటుందని, తన తల్లికి ఉత్తమ గతులు అందేలా భగవంతుడు కటాక్షించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు అనిల్, అమర్ నాథ్, కార్తిక, చైతన్య, శిఖర్, అక్షర తదితరులు పాల్గొన్నారు.