
పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 19,తల్లాడ రిపోర్టర్ ఆర్ బిఐ వారి సూచనల మేరకు అన్నారుగూడెం గ్రామంలో సిఎఫ్ ఎల్ వారు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్య క్రమం శనివారం ఉదయం 10.00 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించారు.ఈ కార్యక్రమంకు తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, అన్నారుగూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ , ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు హాజరైనారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ, ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి,ఆర్థిక భద్రతను పొందేందుకు బ్యాంకు అధికారులతో సమన్వయం అలవర్చుకోవాలని, అంతేకాకుండా ప్రభుత్వ పరమైన పథకాలు, జీవిత బీమా సంబంధిత తదితర విషయాలపై ప్రత్యేకమైన అవగాహన కలిగి ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వం వారు కల్పించే రాయితీలను, భీమా సౌకర్యాలను సద్వినియోగం చేసుకో వాలని అందుకు నిత్యం బ్యాంకు అధికారులను ప్రభుత్వపరమైన ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్న అడిగి తెలుసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు ఆర్థికపరమైన లావాదేవీలు జీవిత బీమా మరి విధమైన ఆర్థిక పెట్టుబడులు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొని బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని అందుకు ప్రతి ఒక్కరు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను మరే ఇతరమైన ఆర్థిక సంబంధ వ్యవహారాలలోనైనా మా బ్యాంకు అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకుని లబ్ది పొందాలని,పాలన సౌలభ్యం కోసం బ్యాంకు మిత్రాలు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అందుబాటులో ఉంటారని ఆయన తెలియజేశారు. బ్యాంకుకు సంబంధించిన ప్రభుత్వ పరమైన అవకాశాలపై ప్రత్యేక అవగాహన ప్రజలకు కల్పించేందుకు మా సిబ్బంది అందుబాటులో ఉంటారని కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను వారు కోరారు. గ్రామ ప్రజలుకు ఆర్థిక భద్రత పై అవగాహన కల్పిస్తారు. ఈ శిబిరాలలో అందించునున్న ముఖ్య సేవలు కే వై సి రెవెరిఫికేషన్ ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా, సురక్షా బీమా పథకాలు అటల్ పెన్షన్ యోజన వివరాలు సైబర్ క్రైమ్, డిజిటల్ భద్రత పై అవగాహన ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అవగాహన కార్య క్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు ఆపతి వెంకటరామారావు, నాయకులు గోవిందు శ్రీనివాసరావు (ట్రాక్టర్), బొమ్మగాని నాదం, సూదా హనుమంతరావు, బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు సహాయక సిబ్బంది, గ్రామ ప్రజలు, రైతులు, మహిళలు, యువత, బ్యాంకు కస్టమర్ల్ తదితరులు పాల్గొన్నారు.
