ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచానికి శ్రీరామరక్ష

పయనించే సూర్యుడు 19-1-2026 గొల్లపల్లి మండల ప్రతినిధి (ఆవుల చందు) గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవ కార్యకర్త గంగాధర మధుసూదన్,ఆధ్వర్యంలో గౌరవ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామ స్మరణ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు ముఖ్య అతిధిగా రజక సంఘం అధ్యక్షులు కలకోట సత్యం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కలకోట సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ మహాజ్ఞాన సంపన్నడు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సేవలు చిరస్మరణీయమని, రాజ్యాంగ నిర్మాతగా ప్రజాభిమా నాన్ని చూరగొప్ప మహానీయుడు అంబేద్కర్‌ ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచానికి శ్రీరామరక్ష సమాజ మార్పు,దీనజనోద్ధారణకు పూనుకున్న అకుంఠిత దీక్షపరుడు అంబేద్కర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి ఎనగందుల రమేష్, రజక సంఘ సభ్యులు ఉపాధ్యక్షులు సాతల తిరుపతి,సాతల్లో భూమయ్య,సాతల లక్ష్మణ్, ఒడ్నాల లక్ష్మణ్, నేరెళ్ల చంద్రయ్య, శాతల్ల మహేష్, గ్రామస్తులు బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులు జేరిపోతుల కొమరయ్య, తడగొండ విజయ్, వేల్పుల రాజేష్, దావుల రాకేష్, సామజిక సేవ కార్యకర్త గంగాధర మధుసూదన్, జెరిపోతుల అంజయ్య,అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.