బోధన్ లో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి

★ రక్తదానం చేస్తున్న తెలుగు యువత ఏత్తోండ రాజేందర్

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 19 బోధన్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా బోధన్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏత్తోండ రాజేందర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మరియు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇవ్వడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన 9 నెలలోనే అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా నిలిచినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏత్తోండ రాజేందర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినటువంటి కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ బోధన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గోపాల్ రెడ్డి మనస్ఫూర్తిగా ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో హరినాథ్. గాంధీ. రంగారావు. సిహెచ్ హనుమంతరావు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు