రేపాక గ్రామ పంచాయతీ నేతృత్వంలో ఉచిత వైద్య సుప్రీం హాస్పిటల్ కరీంనగర్ డా. తిరుపతి

పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి /19: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రేపాక సర్పంచ్ కాత మల్లేశం గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు సుప్రీం హాస్పిటల్ కరీంనగర్ డా. తిరుపతి నేతృత్వంలో రేపాక లో ఉచిత వైద్య శిబిరం తేదీ 18.01.2026 రోజున గ్రామ పంచాయతీ లో పాలకవర్గం తరుపున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 300మందికి (ప్రజలకు)అన్ని రకాల టెస్టులు చేసినారు. సుమారు 75 వేల విలువ గల మెడిషిన్ అందించినరు. 1.బిపి చెకప్ 2.రక్త పరీక్ష 3.షుగర్ చెకప్ 4.సిబిసి 5.ఈసీజీ అన్నీ పరీక్షలు చేసి ఉచిత మందులు అందిచారు ఈ అవకాశం ను 300 రేపాక ప్రజలు ఉపయోగించుకున్నారు ఈ సందర్బంగా డా. సిరవేణి తిరుపతి, డా. ద్యావ రాంరెడ్డి సుప్రీమ్ హాస్పిటల్ బృందం నికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపినారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ మహేష్ వార్డ్ సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు గూడ బాబు సంకటి రాజుయాదవ్ గ్రామస్తులు పాల్గొన్నారు.