పయనించే సూర్యుడు: జనవరి 19 సత్తుపల్లి నియోజకవర్గం: రిపోర్టర్: గద్దె. విజయబాబు సినీ రంగంలో శిఖర స్థాయికి ఎదిగి, రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. తన అపార ప్రతిభ, ఆత్మనిబ్బరం, ప్రజాసేవా తపనతో సాధించిన విజయాలు ఆయన మరణానంతరం కూడా ప్రజల హృదయాల్లో వెలుగుతూనే ఉన్నాయి. తెలుగు ప్రజలందరి ప్రేమతో “అన్న”గా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్. ఎస్ .యు. ఐ. నాయకులు పాల్గొన్నారు..
