పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 19 బోధన్ : సాలూర మండలంలోని హున్సా గ్రామంలో జీవనదాన మహాకుంభ్ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజ్ శిష్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో సుమారు 100 నుంచి 120 మంది వరకు యువత, స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. హున్సా గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, గ్రామ పెద్దలు రామ్ గంగానగర్, సాయినాథ్,మాజీ ఎంపీటీసీ శివకుమార్ ,మురిగె శంకర్,నాని,నిరీక్ష,పాన్ కార్ రాజు, జిల్లా అధ్యక్షులు సాయినాథ్ కథలే,జిల్లా మహిళా అధ్యక్షురాలు సుస్మిత బుచ్చల్వార్, మందర్న రాజు పటేల్,మాజీ జిల్లా అధ్యక్షులు జైరామ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.