190వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు 19-01-2026 కాప్రా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాపర్ : కాప్రా మండలం జమ్మిగడ్డ ప్రాంతంలోని బి.జె.ఆర్ కాలనీలో జ్ఞానమాల టీం ఆధ్వర్యంలో 190వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి జ్ఞానమాల సమర్పించారు. 190వ వారం సందర్భంగా జ్ఞానమాల–2026 సైంటిఫిక్ క్యాలెండర్ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మి రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెరాస రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పెదర్ల శరత్ చంద్ర, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, స్ఫూర్తి గ్రూప్ సభ్యులు గొడుగు యాదగిరి రావు పాల్గొన్నారు. వివిధ పార్టీ నాయకులు మహిపాల్ రెడ్డి, కుమారస్వామి, ఉపేందర్, రవీందర్ రావు, మణెమ్మ, శ్రీశెలం, బాలరాజ్, రమేష్ చారి, లక్ష్మీనారాయణ హాజరయ్యారు. జ్ఞానమాల టీం ఆర్గనైజర్ తాడూరి గగన్ కుమార్, అడ్వైజర్ ఎస్.ఏ. రహీమ్, కో-ఆర్డినేటర్ నర్సింహ చారి, సభ్యులు రవి నాయక్, నరేందర్ రావు, దయానంద్, శ్రీనివాస్, వెంకటయ్య, నగేష్, జాషువా, రాములు రాజు, చందు, రాము, సమద్తో పాటు కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మహనీయుల ఆశయాలు యువతలోకి తీసుకెళ్లేందుకు జ్ఞానమాల కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *