అంతిర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవ కమిటీ ప్రమాణస్వీకారానికి హాజరైన ఎంపీ హరీష్ బాలయోగి

పయ నించే సూర్యుడు జనవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేదిలో జరిగిన లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవ కమిటీ ప్రమాణస్వీకారానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ , ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ లు కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ ఛైర్మెన్ గా ప్రమాణస్వీకారం చేసిన దెందుకూరి రమేష్ (రాంబాబు రాజు) కు మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జరగబోయే స్వామి వారి కళ్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కమిటీకి ఎంపీ హరీష్ బాలయోగి సూచించారు.