పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి.20.2026 ఏ.ఎస్.పి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు అడ్డతీగల మండల కేంద్రంలో ఉన్న సామజిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ కొన్ని నెలలుగా అందుబాటులో లేరని అందువలన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజలను ఆదుకోవాలని “ఆదివాసీ సంక్షేమ పరిషత్”(274/16) ఉమ్మడి అల్లూరి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు అన్నారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీ స్త్రీలను పర్వేక్షించటానికి గైనకాలజిస్ట్ లేకపోవటంతో బయట ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కి పంపిస్తున్నారని అందువలన తమకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని బాధితుల బంధువుల్లో కొందరు తమ దృష్టికి తీసుకుని వచ్చారని ఆయన అన్నారు ఈ విషయంపై అడ్డతీగల సామజిక ఆరోగ్య కేంద్రంలో నిరంతరం గైనకాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి రోజు అవసరం అవుతాయని ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది వస్తారని వారిలో కొంతమంది నిరుపేద కుటుంభికులు కూడా ఉంటారని అలాంటి వారికి ప్రైవేట్ గా వైద్య సేవలు చేయించుకోవటం సమస్యతో కూడుకున్న వ్యవహారమని తక్షణమే ఆసుపత్రిలో ఉండవలసిన అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని రంపచోడవరం ఐ.టి.డి.ఏ – పి.ఓ ద్వారా ఆసుపత్రి యాజమాన్యానికిప్రభుత్వానికి కోరామని అన్నారు.