పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్ సింహాద్రి సూర్యం ఆచారి అకాల మరణంతో ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి జ్ఞాపకార్ధం తెలుగుదేశం పార్టీ తరుపున సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన కుటుంబానికి నాయకులు పరామర్శించి ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా వారు అన్నా క్యాంటీన్ లో ఉచితంగా పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బడ్డ నాగరాజు, ఏఎంసి చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గాలి కృష్ణ, తెలుగుదేశం సీనియర్ నాయకులు నరేంద్ర (చిన్ని), 9వ వార్డు ఇన్చార్జ్ సర్విశెట్టి గోవిందరావు, 10వ వార్డు యూనిట్ ఇంచార్జ్ ఉమాకాంత్ గారు 11వ వార్డు ఇన్చార్జ్ నిత్యానంద పండా (నాగు), 14వ వార్డు ఇన్చార్జ్ కొండాల ధనేశ్వరరావు, 15వ వార్డు ఇన్చార్జ్ నాబిల్లి శ్రీనివాసరావు, 11వ వార్డు తెలుగుదేశం సీనియర్ కార్యకర్త జి వాసు, హనుమంతు శ్రీనివాసరావు, సీనియర్ టిడిపి నాయకులు బొబ్బిలి సంతోష్, పరశురాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.