ఆదోని జిల్లా డిమాండ్‌తో 65వ రోజు నిరసన,ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘీభావం

పయనించే సూర్యుడు జనవరి 20 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే న్యాయమైన డిమాండ్‌తో కొనసాగుతున్న నిరసన కార్యక్రమం సోమవారం 65వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన దీక్షలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఆదోని జిల్లా కావడం ప్రజల హక్కు అని వారు పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదోని జిల్లాను సాధించేవరకు పోరాటం ఆగదని, ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జె. హెచ్. రెడ్డి, పి. రంగస్వామి, కె. ఈరన్న, మందుల హనుమంతప్ప, కె. జె. చారి, కె. సురేష్ బాబు, కె. రామి రెడ్డి, టి. వీరేష్, పాల్గొన్నారు.