పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా సోమవారం పలాస శాసన సభ్యులు గౌతు శిరీష ఉచిత పశువైద్య శిబిరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు పసుపోషకులు వినియోగించుకోవాలని కోరారు. పలాస నియోజకవర్గంలో గల అన్ని గ్రామపంచాయతీలో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ శిబిరాల్లో ఉచిత పశువైద్య చికిత్సలు వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధులు చికిత్స, శాస్త్రీయ పశుపోషణపై అవగాహన కల్పించనున్నట్లు పలాస ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మందస పశువైద్యాధికారి డాక్టర్ దువ్వాడ శ్రీకాంత్, గోవిందపురం పశువైద్యాధికారి డాక్టర్ కే మధుబాబు, బొడ్డుపాడు పశువైద్యాధికారి డాక్టర్ చైతన్య, ఎల్ ఎస్ ఏ కె కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.