పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20, 2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు శ్రీ శక్తి పథకం మహిళలు ఉచిత బస్ ప్రయాణాలతో కిక్కిరిసిపోతున్న బస్సులు, ఉచిత పథకాలతో ప్రజలను సోమరిపోతులు చేస్తున్న ప్రభుత్వాలు, ఉచితాలకు అలవాటు పడ్డ ప్రజలు, నాయకులు అధికార దాహం కొరకు ఉచితల పథకాలు వైపు అలవాటు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసి అదో గతి పట్టిన పర్వాలేదు అన్నట్టుగా, మహిళలకు 5రకాల ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో ప్రయాణికులలో మహిళలే అధికంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా సీటు కెపాసిటీ పరిమితికి మించి ఫుట్ పాత్ మీద నుండి బస్సు వెనకాల లాస్ట్ సీటు వరకు నిలుచుని, సీటు కెపాసిటీ కాదని 100మంది ప్రయాణికులు దాకా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వైనం, అధిక లోడును లాగలేక మోరాయిస్తున్న పాత బస్సులు, పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్న, అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న దృశ్యం, అంటే అది ప్రభుత్వ సమస్త కాబట్టి పరిమితికి మించి ప్రయాణిస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోరు. అదే ఒక ప్రైవేటు వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తే, మోటార్ సైకిల్ ఇన్స్పెక్టర్,ట్రాఫిక్ పోలీస్ శాఖ అధికారులు ఫైన్లు వేయడం కేసులు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ వాహనాల్లో ఓవర్ లోడుతో ప్రయాణికులు ప్రయాణిస్తే, ప్రమాదాలు జరగవా, ప్రైవేటు వాహనాల్లో మాత్రమే ప్రమాదాలు జరుగుతాయా, మూడు నెలల క్రితం ఉచిత బస్సు అధికలోడుతో ప్రయాణిస్తు ఎదురుగా వస్తున్న కంకర్లో ఢీకొని నుజ్జు నుజ్జు అయినా తెలంగాణ ఆర్టీసీ బస్సు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన విదేతమే ప్రయాణికులు, వారి జీవితాలకు వెలకట్టి నష్టపరిహారం అందించారు. కానీ, పోయిన ప్రాణాలను మాత్రం డబ్బుతో కొనలేం, ప్రభుత్వమైన అధికారులైనా ప్రైవేటు వాహనాలైనా ప్రభుత్వ వాహనాలైకైనా, ఒకటే రూల్స్ వర్తించాలి. ఉచిత బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణించకుండా, అధికారులు చర్యలు చేపట్టడంలో విఫలం అవుతున్నారని, టికెట్ కొని ప్రయాణిస్తున్న పురుషులకు గమ్యం చేరేంతవరకు నిలుచొని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఉచిత బస్సులతో ప్రయాణం నరకయాత్రంగా మారిందని, ప్రభుత్వలు అనాలోచిత నిర్ణయం వలన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందన, ఉచిత ప్రయాణాల వలన కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రం అప్పుల పాలు అవ్వడమే కాకా రాష్టం దివాళా పరిస్థితికి చేరుకోవడం కాయమన్నారు. ఇలాగే ఈ కూటమి ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంటే దేశంలోనే నెంబర్ వన్ అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారడం ఖాయమని ప్రజలారా మేలుకోండి ఉచితలకు అలవాటు పడి, శ్రీలంక దుస్థితిని కోరి తెచ్చుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్నించే పరిస్థితులలో వైసీపీ ప్రతిపక్షం లేదు