ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

★ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మండల్ జనవరి 20 సమీయొద్దీన్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి అందజేశారు కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షులు మానుక ప్రవీణ్ కుమార్. మాట్లాడుతూ తారక రామారావు పల్లె పల్లె లో అభివృద్ధి కార్యక్రమం చేసి ఎన్టీ రామారావు ప్రజల గుండెలో తారక రామా రావు గా నిలిచిపోయారని మానుక ప్రవీణ్ గుర్తు చేశారు. కీర్తిశేషులు నందమూరి తారకరామారావు. భారతరత్న బిరుదు వెంటనే ప్రకటించాలని కోరుతూకోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎన్టీఆర్ జిల్లా అభిమాన సంఘ అధ్యక్షులు మానుక ప్రవీణ్ కుమార్. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కీర్తిశేషులు ఎన్టీ రామారావు.తెలుగు చలన చరిత్రలో రాజకీయ రంగంలో ఒక చరిత్ర సృష్టించి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వ్యక్తి అని అలాగే, కేవలం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల వ్యవధిలోని అధికారం చేపట్టి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఘనత కేవలం ఎన్టీఆర్కె దక్కిందని,అలాగే చలనచిత్ర పరిశ్రమలలో ఎన్నో పాత్రలకు జీవం పోసి రాముడు, శ్రీకృష్ణుడు, రావణ పాత్రలు పోషించి ఇటు రాజకీయ రంగంలోనూ అలాగే రెండు రూపాయలకి కిలో బియ్యం, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు,జనత వస్త్రాలు, పక్కా గృహ నిర్మాణ పథకం, మండలిక వ్యవస్థ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రైతులకు స్లాబు పై కరెంటు, బడుగు, బలహీన వర్గాలకు. మహిళలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్స్ ఇలా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజలలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని అలాగే కేంద్రంలో కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా చరిత్ర సృష్టించి కేంద్ర ప్రభుత్వం లో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసిన ఘనత మన ఎన్టీఆర్ దే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం వెంటనే ఎన్టీఆర్. భారతరత్న బిరుదును ప్రకటించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పోడేటి రమేష్ గౌడ్, రహీం, ఎండి రఫీ యుద్దీన్,కొక్కుల మహదేవ్, ఎనుగందుల శ్రీనివాస్, పాతర్ల విజయ్ కుమార్, బాదం మోహన్, ఎల్ అంజయ్య, రమేష్, అలాగే తెలుగు మహిళా నాయకురాలు మైనార్టీ నాయకురాలు రజియా బేగం, మిశ్రా కౌసర్, సాజిదా పర్వీన్, రాణి, కమల, రుచిత, తెలుగు యువత నాయకులు నదీమ్, సుల్తాన్, సిద్ధార్థ మరియు భాను తదితరులు పాల్గొన్నారు.