ఎన్ ఎఫ్ ఎల్ ఎ టి – 2024 ఫలితాలలో జడ్ పిహెచ్ఎస్ కోరపల్లి విద్యార్థుల ప్రతిభ.

పయనించే సూర్యుడు జనవరి 20 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ( ఏఐఎఫ్) ఆధ్వర్యంలో అమలు అవుతున్న ఈ వైస్ కిల్ బ్రిడ్జి ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థుల్లో ఆర్థిక సాక్షరత ( ఫైనాన్షియల్ లిట్రసి అవేర్నెస్ ) అభివృద్ధి లక్ష్యంగా ఎన్ ఎఫ్ ఎల్ ఎ టి (నేషనల్ ఫైనాన్సియల్ లీటరసీ అసెస్మెంట్ టెస్ట్ ) – 2024 పరీక్షను నిర్వహించారు. తాజాగా ప్రకటించిన ఫలితాలలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లోని కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు విశేష ప్రతిభ ప్రదర్శించి ఔట్స్టాండింగ్ సర్టిఫికెట్స్ సాధించారు. విజేతలైన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి సర్టిఫికేట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి.రాజయ్య , పి శ్రీనివాస్, ఎ. నరహరి, సి.రవికాంత్‌రాజు, పి. కుమారస్వామి , పి. విజేందర్ రెడ్డి, కె. పద్మ, జి. శ్రీనులతో అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ఏయ్ స్కిల్ బ్రిడ్జి ప్రాజెక్ట్ క్లస్టర్ కోఆర్డినేటర్ మైమున్నిసా , మరియు జిల్లా కోఆర్డినేటర్ లంకా మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో భవిష్యత్తు ఆర్థిక నిర్ణయాలపై అవగాహన పెంపు లక్ష్యంగా ఈ పరీక్షలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.