ఐడీబీఐ బ్యాంక్ క్యాలెండర్ల ఆవిష్కరణ

పయనించే సూర్యడు / జనవరి 20/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు మల్లాపూర్‌లోని అంజి గౌడ్ ఫర్నీచర్స్ ప్రాంగణంలో ఐడీబీఐ బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్లను గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు మరింత చేరువ కావాలని, బ్యాంకులు–ప్రజల మధ్య అనుబంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. స్థానిక వ్యాపారులు, మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ భార్గవి, మల్లాపూర్ సీనియర్ నాయకులు అంజి గౌడ్, బెల్లం గట్టయ్య, కోయలకొండ రాజేష్, రాజు ముదిరాజ్, రాకేష్ గౌడ్, నాగరాజ్ గౌడ్, సాయి గౌడ్‌తో పాటు మల్లాపూర్ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.