కన్నాల సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్‌కు ఘన సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామ సర్పంచ్‌గా ఇటీవల గెలుపొందిన ప్రజా సేవకులు, ప్రజా నాయకుడు గుడిసె గట్టయ్య యాదవ్‌కు యాదవ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధి రమేష్ యాదవ్ ఘనంగా సన్మానం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ కాంటెస్టెడ్ మెంబర్ పొన్నం రవీందర్ యాదవ్ కూడా పాల్గొని గుడిసె గట్టయ్య యాదవ్‌ను అభినందించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో గుడిసె గట్టయ్య యాదవ్ అంకితభావంతో పనిచేస్తారని, సర్పంచ్‌గా కన్నాల గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిద్ధి రమేష్ యాదవ్ మాట్లాడుతూ, యాదవ సమాజం నుంచి ప్రజాప్రతినిధులు ఎదగడం గర్వకారణమని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.