పయనించే సూర్యుడు జనవరి 20 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్:-ఉట్నూర్ మండలం శ్యాం పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కోలంగూడా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధి ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధ్యమైందన్నారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దీపక్ ఉపసర్పంచ్ కేశవ్ మాజీ సర్పంచ్ జగదీష్ ఎందా బాబాపూర్ పులిమడుగు గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.
