క్రీడాకారులకు ప్రథమ చికిత్స మందుల కిట్టు అందజేత

పయనించే సూర్యుడు న్యూస్: జనవరి/20: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్: సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో కింగ్స్ లేవన్ పిఎల్పి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా క్రీడాకారులకు సోమవారం ప్రథమ చికిత్స కోసం అవసరమే మందులు అందజేసిన దుద్దెఢ రాజు (దేవి దుర్గా మెడికల్ ) ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసాన్ని ఇస్తాయని చెడు వ్యసనాలకు దురంగా ఉండాలి, క్రమశిక్షణగా ప్రవర్తించి అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఆటలతో ఆరోగ్యం స్నేహాభావం క్రమశిక్షణకి దోహదపడ్డాయని క్రీడాకారులకు సూచించారు క్రీడా స్ఫూర్తిని చాటాలని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు మెడికల్ కిట్ అందజేసినందుకు దుద్దెడ రాజు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ రెడ్డి,అనిల్ కుమార్ ,సాయి ,వేణు ,రజినీకాంత్, మరియు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.