పయనించే సూర్యుడు జనవరి 20 పాపన్నపేట్ మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ సంగారెడ్డిలోని డా. బీఆర్ అంబేడ్కర్ మైదానంలో ఈనెల 17 నుంచి 19 వరకు జరిగిన “సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026” క్రీడా పోటీల్లో కుర్తివాడ యువకులు సత్తా చాటారు. ఖోఖో విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి, ట్రోఫీతో పాటు రూ.25,000 రివార్డును కైవసం చేసుకున్నారు. ట్రోఫీ మరియు రూ.25,000 చెక్కును మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ పోటీల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 15-17 ఏళ్ల లోపు వయస్సు గల క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన క్రీడాకారులు దినేష్ గౌడ్ (కెప్టెన్), అనిల్ పెంటయ్య, నవదీప్, రితీష్, మహేష్, జెట్సన్, ప్రవీణ్, ప్రదీప్, జస్వంత్, శివానంద, ఆంజనేయులు, ఆకాష్, వంశీ, రఘునాథ్, విజయ్ (కోచ్), హరీష్ (కోచ్) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రథమ స్థానంలో నిలవడం పట్ల గ్రామస్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.