గతంలో నోటీసులు ఇచ్చారు చేతులు దులుపుకున్నారు

★ జనవరి 22 అక్రమదారులకు డెడ్ లైన్- ఈసారైనా అక్రమ నిర్మాణాల తొలగిస్తారో లేదో!

పయనించే సూర్యడు జనవరి. 20.2026 ఆదివాసి సంక్షేమ పరిషత్(రీ నె:274/16) వైరామవరం మండల కేంద్రంల ఆర్.అండ్.బి స్థలాలను పంచాయితీ రెవెన్యూ ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వ్యాపార సముదాయాలు నివాస గృహాలు వంటి నిర్మాణాలు చేపట్టి ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని గతం నుండి ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు స్థానికులు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు, గత సంవత్సరం రోడ్డు వైన్డింగ్ పేరుతో కూడా ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప నోటీసులో పేర్కొన్న విధంగా అక్రమ కట్టడాలపై అక్రమ దారులపై పంచాయతీ రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి అయితే ఇటీవల ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు స్థానికులు అక్రమ కట్టడాలపై చేస్తున్న పోరాటంలో భాగంగా స్పందించిన ఉన్నతాధికారులు అదేవిధంగా లోకయుక్తలో పెట్టిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 7వ తేదీన ఆక్రమ దారులకు అందరికీ పంచాయతీ అధికారులు జనవరి 22 గడువు తేదీ తెలియజేస్తూ ఈ లోపు స్వచ్ఛందంగా అక్రమదారులే తొలగించుకోవాలని లేనియెడల పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అధికారులే జెసిబిలు తోటి అక్రమ కట్టడాలు తొలగించి వాటికి అయ్యే ఖర్చు ఆక్రమ దారుల నుంచి చెల్లించేలాగా చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చి ఉన్నారు" ఈ నోటీసులో పేర్కొన్న విధంగానే పంచాయతీ రెవెన్యూ మరియు ఆర్ అండ్ బి అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని గతంలో మాదిరిగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ప్రకటన ద్వారా హెచ్చరిక జారీ చేశారు కేవలం వై.రామవరం మండలం మాత్రమే కాదు పోలవరం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు ఇప్పటికే రెవెన్యూ పంచాయతీ ఆర్.అండ్.బి అధికారులు అన్ని రకాల అక్రమ కట్టడాలు గుర్తించి రెండు మూడుసార్లు నోటీసులు ఇచ్చి తొలగించకుండా వదిలేస్తున్నారని పోలవరం జిల్లా వ్యాప్తంగా అక్రమ కట్టడాలు తొలగింపు ముమ్మరం చేయాలని ఆయన ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు అప్పటివరకు అక్రమ కట్టడాలపై ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు కుంజా శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.