జనతా వారధి – జిల్లా సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ

పయ నించే సూర్యుడు జనవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనతా వారధి జిల్లా కన్వీనర్, కో.కాన్వీనర్ చీకరమెల్లి శ్రీనివాసరావు, చాట్రాతి జానకిరాంబాబులతో కలిసి, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో భూ రీ-సర్వే పేరుతో తప్పుడు కొలతలు, సర్వే నంబర్ల మార్పులు, విస్తీర్ణ అవకతవకలు, ఆధార్ లింక్ పొరపాట్లు జరిగాయని ఆరోపించారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో ప్రవేశపెట్టిన వీఆర్ఏ సచివాలయాల్లో కూడా అవినీతి, అలసత్వం కొనసాగాయని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రాజముద్రతో కొత్త పట్టాదార పాస్‌బుక్‌లు మంజూరు చేస్తున్నందుకు స్వాగతిస్తున్నామని, అయితే గత తప్పిదాల ఆధారంగా ఇవ్వకుండా రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టాలని కోరారు. భూ యజమానులు, రైతులకు న్యాయం చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, సన్నిధిరాజు వీరభద్ర శర్మ, చాణక్య, సీనియర్ నాయకులు చిరట్ల సుబ్బారావు, కె.వి.సుబ్రహ్మణ్యం, పావులూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంప్రదించండి: అడబాల సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు (ఫోన్: 8466971336 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *