పయనించే సూర్యుడు, జనవరి 20 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ శేరిలింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షులు,, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి కవి, సీనియర్ జర్నలిస్టు మోటూరి నారాయ ణరావును కర్ణాటక కు చెందిన సంక్రాంతి లిటరరీ అవార్డ్ వరించింది. కర్ణాటక తె లుగు రైటర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఇండో ఏషియన్ అకా డమీ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి లిటరరీ అవార్డ్స్ 2026 కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా దక్షిణాది భాషా పండితులు, కవులు, రచయితలు హాజరైన మల్టీ లింగ్వల్ పోయిట్ మీట్ కు కవి మోటూరి నారాయణ రావు హాజరయ్యారు.. కేటీఆర్ఎఫ్ అధ్యక్షు లు మాల్యాద్రి నిర్వాహణా సారధ్యంలో బహుభాషా కవి సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు,అస్సాం, కర్ణాట క ,కేరళ వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కవుల సమ క్షంలో. మోటూరి నారాయణరావు లిటరరీ అవార్డ్ 2026 ను అందుకున్నా రు. ఈ సందర్భంగా కవి, సీనియర్ జర్నలిస్టు మోటూరి నారాయణరావును మాట్లాడుతూ.. అజంతా భాషగా అల రారే అందమైన తెలుగు భాషను పరిర క్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాతృభాష అస్థిత్వాన్ని కోల్నొతే తెలుగు ఉనికి ప్రశ్నార్థకమవు తుందని వాపోయారు. పరభాషా వ్యామోహంలో పడి అమ్మ భాషను విడనాడటం మంచి ది కాదన్నారు. తెలుగు భాషాభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. తెలుగు భాషాభిమానులను ఒక వేది కపైకి తీసుకువచ్చి సాహిత్యాభ్యున్నతికి కృషి చేస్తున్న కర్ణాటక తెలుగు రైటర్స్ ఫెడరేషన్ సేవలను కొనియాడారు. సంక్రాంతి లిటరరీ అవార్డ్ అందించిన కార్య నిర్వాహక బృందానికి తెలుగు వెలుగు సాహిత్య వేదిక తరఫున కృతజ్ఞతలు తెలిపారు.