తపస్ రాష్ట్ర అకాడమి కన్వీనర్ గా నియామకం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 20 మామిడిపెల్లి లక్ష్మణ్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అకాడమి కన్వీనర్ గా రాయికల్ పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన ఉపా ధ్యాయుడు చెరుకు మహేశ్వర శర్మ నియమితులయ్యారు. హైదారాబాద్ లో జరిగిన సంఘం రాష్ట్ర సమావేశంలో ఈ మేరకు బాధ్యతలు చేపట్టారు. గతంలో తపస్ మండల శాఖ అధ్యక్షుడు గా జగిత్యాల జిల్లాకార్యదర్శిగా, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా, ఆయన వ్యవహరించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వొడ్నాల రాజశేఖర్, టి. పెంటయ్యలకు మహేశ్వర శర్మ కృతజ్ఞతలు తెలి పారు. మహేశ్వర శర్మ నియామకంపై జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయిన్ పల్లి ప్రసాద్ రావు కొక్కుల రాజేష్, మండల శాఖ అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పుర్రె రమేష్ తపస్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.