తల్లాడ మాజీ ఎంపీపీ సోమవారం పలు కుటుంబాలను పరామర్శ

* కార్యక్రమంలో పాల్గొన్న అన్నారు గూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 20,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు సోమవారం పలు కుటుంబాలను పరామర్శించారు, ఈ పరామర్శ కార్యక్రమంలో అన్నారు గూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మరియు మరి కొంతమంది యువజన నాయకులు ఉన్నారు. కోపెల చెన్నయ్య కు ఘన నివాళులు : తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు కోపెల చెన్నయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. సోమవారం ఆయన దశదిన కార్యక్రమం అన్నారుగూడెం నందు వారి గృహంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పీ దొడ్డ శ్రీనివాసరావు హాజరై చెన్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేశారు. మానుకొండ సీతారావమ్మకు శ్రద్ధాంజలి – ఏన్కూరు మండలం గార్లవడ్డు గ్రామానికి చెందిన మానుకొండ సీతారావమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం జరిగిన ఆమె దశదిన కార్యక్రమానికి తల్లాడ మాజీ ఎంపీపీ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అన్నారు గూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు, ఆ పార్టీ మండల నాయకులు మారెళ్ళ దేవేందర్, గోపాలపేట బిఆర్ఎస్ నాయకులు కొమ్మినేని శ్రీనివాసరావు,నాయకులు తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, అన్నారు గూడెం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కూరి రంగయ్య, లక్ష్మణ్, నరేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *