పయనించే సూర్యుడు జనవరి 20, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో ద్వాదశ జ్యోతిర్లింగాల మహా పడిపూజ కార్యక్రమం దాసమోని కృష్ణయ్య గురుస్వామి ఆధ్వర్యంలో తిరుపతి స్వామి స్వగృహంలో అత్యంత వైభవంగా జరిగింది. శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అర్చనలు చేసి, మంగళ హారతులు ఇచ్చారు. తిరుపతి స్వామి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక పడిపూజకు గ్రామ సర్పంచ్ తో పాటు స్థానిక శివస్వాములు భాస్కర్ స్వామి, కేశవులు, నర్సింలు, గణేష్, తిరుపతి, లాల్ సింగ్, శంకర్ నాయక్, హరికృష్ణ, ప్రశాంత్, హరిరామ్ నాయక్, విష్ణు స్వామి, సత్యం స్వామి, రవి స్వామి వివిధ గ్రామాల శివ స్వాములు , కళాశేఖర్ ఆర్కెస్ట్రా బృందం ,ప్యాడ్ వెంకటేష్ ,కీ బోర్డు ఎమ్ వి రత్నం లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
