పయనించే సూర్యుడు జనవరి 20, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన మాజీ వెటర్నరీ అసిస్టెంట్ తుమ్మలపల్లి వెంకటనారాయణ చిత్రపటానికి పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ అంబటి శాంతయ్య, మండల టిఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, వంకాయలపాటి సత్యం, సామినేని బాబురావు, మండల సిపిఎం నాయకులు తోటకూరి వెంకట నరసయ్య, సామినేని అప్పారావు, పాల్గొన్నారు. అలాగే మండల కాంగ్రెస్ నాయకులు ఆలస్యం బసవయ్య, మండల బిజెపి నాయకులు మద్దినేని వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు అంబటి సైదేశ్వర రావు ,తోటకూరి చిన్న, కొల్లి బాబు, అంబటి సత్యనారాయణ, ఎండోమెంట్ ఈవో తోటకూరి వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు ఆలస్యం శంకర్, గ్రామ పెద్దలు అయినాల నాగేశ్వరరావు, అయినాల సంజీ తదితరులు పాల్గొన్నారు. తుమ్మలపల్లి వెంకటనారాయణ ప్రజాసేవలో చేసిన కృషి అప్పటికి గుర్తిండి పోతుందని నాయకులు పేర్కొన్నారు.