త్వరలో వంకాయలపాడు గ్రామంలో వైసీపీ గ్రామస్థాయి కమిటీ కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 యడ్లపాడు మండల ప్రతినిధి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపితం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు కార్యక్రమం త్వరలో ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో కూడా నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఖాదర్ బాషా మాట్లాడుతూ, వైసీపీ శక్తి కార్యకర్త లేనని, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే రానున్న రాజకీయ పోరాటాలకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. జగనన్న పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత పార్టీ నాయకులు, యువతపై ఉందని ఆయన సూచించారు. ఈ సమావేశంలో వంకాయలపాడు గ్రామ వైసీపీ అధ్యక్షుడు షేక్ అల్లాబక్షు (బుజ్జి), సయ్యద్ మస్తాన్ వలి తదితర నాయకులు పాల్గొని, రాబోయే గ్రామస్థాయి కమిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, యువత, అభిమానులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా వంకాయలపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు