పయనించేసూర్యుడు జనవరి 20 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామం కాపురస్తుడైన ఉసుకప్ప పెద్దయ్య (పూజారి) తండ్రి. హుసేని అను నేను వ్రాసుకున్న విన్నపం ఏమనగా చిలకల డోన గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 65ఎ,65బి 65సి. లో విస్తీర్ణం 7 ఎకరాలు కలదు.మా తాతల కాలం నుండి వంశపర్యాపరంగా ఇప్పటివరకు మేము లక్ష్మమ్మ అవ్వ గుడి పూజారులుగా కొనసాగుతున్నాము. లక్ష్మమ్మ అవ్వ గుడి ఇనాం భూమి సర్వే నంబర్ 65ఎ.65బి,65 సి. నందు మొత్తం 7.00 ఎకరాల భూమి కలదు. లక్ష్మమ్మ అవ్వ గుడి ఇనాం భూమిను పక్క పొలం లో వారు ఆక్రమించడం జరిగింది. అందులో గోనె పోగు నీలమ్మ,గోనె పోగు దేవారం ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ , ఫేక్ డెత్ సర్టిఫికెట్ ను తీసుకొని రెవెన్యూ అధికారుల చుట్టు తిరుగుతున్నారు భాస్కర్ యాదవ్ అండ దండ తో సరైన ఆధారాలు లేకపోయినా డబ్బులు ఇస్తే పని అవుతుందని ఇనాం భూమి పట్టా కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూన్నారు. లక్ష్మమ్మ గుడి దేవాలయం,ఆంజనేయ స్వామి దేవాలయం,కు సంబంధించిన ఇనాం భూములను ఎవ్వరికీ కూడా ఎటువంటి పట్టాలు మంజూరు చేయ రాదని, మరియు భూమి నీ ఆక్రమించి సాగు చేసుకుంటున్న వారిని భూమి నుంచి ఖాళీ చేయించి గుడి భూమీ నీ లక్ష్మమ్మ అవ్వ గుడి పూజారి గా కొనసాగుతున్న మాకు అనుమతిని ఇవ్వాలని తమరిని విన్నవించుకుంటున్నాను.