పయనించే సూర్యుడు 20-1-2026 మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చెందోలి గ్రామానికి చెందిన అంకతి సమత. తిరుపతి గార్ల కుమారుడు అంకతి నవీన్ భారత నావికాదళ సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ ఇటీవల విడుదల చేసిన ఫలితాలలో ఉద్యోగానికి ఎంపిక అవడం జరిగింది దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఎన్సిసి లో చేరి భారత నావికాదళనికి సంబంధించిన పరీక్షలకు సాధన చేసి గత సంవత్సరం పరీక్ష రాసి శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తి చేయగా నవీన్ కి ఉద్యోగం రావడం తో చందోలి గ్రామానికి చెందిన సర్పంచ్ జక్కుల పావని దస్తగిరి ఉప సర్పంచ్ దొనకొండ గంగాధర్ నవీన్ మరియు వారి తల్లిదండ్రులకు సంఘ భవనం ఆవరణంలో పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని యువకులు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షనీయమన్నారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చింతం వార్డు సభ్యులు జక్కుల లక్ష్మీరాజ్యం మామిడాల నాగరాజు పల్లెల నారాయణ యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.