పెండింగ్ బిల్లులు ఇప్పించేందుకుకృషి చేస్తా కట్టరాంపూర్ లో వాటర్ పైప్ లైన్పనుల ప్రారంభించిన

* కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

పయనించే సూర్యుడు జనవరి 20 కరీంనగర్ న్యూస్ : సోమవారం సాయంత్రం కరీంనగర్ లోని 10 వ డివిజన్ లో కట్టరాపూర్ నుంచి కోతిరాంపూర్ వరకు కోటి రూపాయలతో చేపట్టనున్న హెచ్ డిపి ఈ వాటర్ పైపులైన్ పనులను వెలిచాల రాజేందర్రావు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేందర్రావు మాట్లాడుతూ కరీంనగర్లో రోడ్లు డ్రైనేజీలు ఇతర మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర సమస్యలను గాలికి వదిలేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కట్ట రాంపూర్ నుంచి కోతి రాంపూర్ వరకు సరైన రోడ్డు పైప్ లైన్ లేక ప్రజలు నానాయాతన పడ్డారని పేర్కొన్నారు. ఈ విషయంపై తాను, మంత్రి పొన్నం ప్రభాకర్ వేరువేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు. నగరంలో పెండింగ్ అభివృద్ధి పనులకు సంబంధించి 30 కోట్లు మంజూరు చేయించామని ఇంకా 50 కోట్లు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరలో మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ కోడూరు రవీందర్ గౌడ్ విజ్ఞప్తి మేరకు కోతి రాంపూర్ లో పెండింగ్లో ఉన్న పైపులైన్ పనులను తన సొంత ఖర్చులతో చేయిస్తానని రాజేందర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా పైప్ లైన్ పనులు, రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలంతా గెలిపించి బహుమతిగా అందించాలని కోరారు. ప్రజలంతా కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బ్రహ్మాండమైన విజయం అందిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తారని రాజేందర్రావు పేర్కొన్నారు. పైపులైన్ పనులు ప్రారంభానికి విచ్చేసిన రాజేందర్రావును కాంగ్రెస్ నాయకులు, మహిళలు, స్థానిక డివిజన్ ప్రజలు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కోడూరి రవీందర్ గౌడ్ ఆకుల నరసన్న టేలా భూమయ్య ఆర్ష మల్లేశం, కాంగ్రెస్ నాయకులు నరహరి జగ్గారెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, మూల జైపాల్, కన్నయ్య గౌడ్, చర్ల పద్మ, నేల్లి నరేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్టల లింగయ్య రమణారెడ్డి, నాయకులు, డివిజన్ ప్రజలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *