
పయనించే సూర్యుడు జనవరి 20 భీమదేవరపల్లి:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గ్రామమైన వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో వంగర, రంగయ్యపల్లి, రాంనగర్, రత్నగిరి, మాణిక్యపూర్, గాంధీనగర్ మొదలుకొని ఆరు గ్రామాలు ఉన్నాయి.. వంగర ఎస్సై దివ్య ఆధ్వర్యంలో నిరంతరం ప్రజలతో మమేకమై, పోలీసింగ్ వ్యవస్థను ప్రజలకు వివరిస్తూ, నేర నియంత్రణ తగ్గించడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ, ప్రజలకు అవసరమైన నమ్మకాన్ని కలిగిస్తుంటారు.. డయల్ 100, సైబర్ నేరాలపై అవగాహన, బాల్య వివాహాల నియంత్రణ, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు నుండి యువతను కాపాడడం, డిజిటల్ హాకింగ్, రోడ్డు భద్రతా ప్రమాణాలు, డ్రంక్ అండ్ డ్రైవ్లు, వాహనాల తనిఖీలు మొదలగు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, నేర నియంత్రణ చేయడంలో నిరంతరం ముందుంటున్నారు.. వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ పై పెట్రోలింగ్ ప్రారంభించి, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రశంసలు కూడా అందుకున్నారు.. రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించే వారిని అభినందించడం, సత్కరించడం వంటివి చేసి, వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటించే విధంగా ప్రోత్సహించడం, వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి, ఉత్తమ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విశేష సేవలు అందిస్తున్నారు.. దరఖాస్తు కోసం వచ్చేవారిని గౌరవిస్తూ, ఫిర్యాదు స్వీకరించడం, తగిన సమాచారాన్ని సేకరించడం, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించడం, ద్వారా ప్రజలు ఫ్రెండ్లీ పోలీసింగ్ ను ఇష్టపడుతున్నారు.. ఉన్నత అధికారులు తనిఖీలు నిర్వహించిన వంగర పోలీసుల పనితీరుపై సంతృప్తి చెందడం, ముందుకు సాగే ఇతర అంశాలపై సూచనలు చేయడం కూడా జరుగుతున్నాయి.. ప్రతిరోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నిర్వహిస్తూ, వాహనాలు ప్రమాదాలుకు గురికాకుండా, కాపాడుతున్నారు..

