
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 బోధన్: గ్రామానికి సంబంధించిన ప్రతి అంశాన్ని రికార్డులో నమోదు చేయాలని గ్రామపంచాయతీ కార్యదర్శిని సాలూర మండల ఎంపీడీవో శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం సాలూర మండలం హున్సా గ్రామపంచాయతీని ఎంపీడీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు పూర్తిస్థాయిలో సక్రమంగా ఉండడం వలన ఎంపీడీవో సంతృప్తి చేశారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న మహిళ సమైక్య నూతన భవన నిర్మాణాన్ని ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పరిశీలించారు. బిల్డింగ్ నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసి చైర్మన్ చీల శంకర్, గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్, ఉప సర్పంచ్ నాగేష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.