
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 బోధన్: బోధన్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఉషోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కారు మరియు ఆటో డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ కారు, ఆటో డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడిపితే కట్టిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ ఎస్ఐ భాస్కర్ చారి ట్రాఫిక్ సిఐ మహేష్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.