ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనితీరుపై విజిలెన్స్‌కు ఫిర్యాదు

★ బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలి ★ మొలుమూరు శ్రీనివాస్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ- జనవరి-20:- సింగరేణి ఆర్‌జీ–3 పరిధిలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ విజిలెన్స్ అధికారులకు బిజెపి సీనియర్ నాయకులు పెద్దపల్లి జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మొలమూరి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాణి రుద్రమదేవి స్టేడియం అభివృద్ధి పేరుతో లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి, తర్వాత పూర్తిగా వృథాగా వదిలేయడం జరిగిందని,ప్రజలకు ఉపయోగపడేలా క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాణి రుద్రమదేవి స్టేడియంలో గడ్డి, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు.కానీ పనులు పూర్తయిన తర్వాత సరైన నిర్వహణ లేకపోవడం వల్ల, నాటిన గడ్డి మొత్తం ఎండిపోయి మైదానం నిరుపయోగంగా మరిందని నీటి వసతి, పర్యవేక్షణ, సంరక్షణ ఏదీ లేకపోవడంతో లక్షల రూపాయల ఖర్చు చేసిన అభివృద్ధి పనులు నిరుపయోగమయ్యాయి అన్నారు.ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే కాకుండా ప్రజాధనం దుర్వినియోగంగా భావించాల్సిన పరిస్థితి అని ఈ పనులకు సంబంధించిన నిధులు ఎలా ఖర్చయ్యాయి, ఎవరి పర్యవేక్షణలో పనులు జరిగాయి, నిర్వహణ బాధ్యత ఎవరిదన్న అంశాలపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది అన్నారు.అందుకే సింగరేణి ఆర్‌జీ–3 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంచనా వ్యయం, బిల్లులు, పనుల నాణ్యత, నిర్వహణ లోపాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.