బానోత్ అర్జున్ బాబుకు ఓయూ డాక్టరేట్

★ అభినందించిన డిప్యూటీ సీఎం

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 20, తల్లాడ రిపోర్టర్ తెలంగాణ ఉద్యమకారుడు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బానోత్ అర్జున్ బాబు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో డాక్టరేట్ పట్టా సాధించారు.వివరాలలోకి వెళ్తే ఓయూ ప్రొఫెసర్ స్మిత సాంబ్రాణి పర్యవేక్షణలో "కంపేరేటివ్ స్టడీ ఆఫ్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ షాపింగ్: ఏ కేస్ స్టడీ ఆఫ్ హైదరాబాద్,తెలంగాణ" అనే అంశంపై అర్జున్ బాబు చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. ఖమ్మం జిల్లా కస్నాతండాకు చెందిన అర్జున్ బాబు,మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాడు.డిగ్రీ వరకు ఖమ్మం జిల్లాలో చదివి,ప్రతిష్టాత్మక JNTU యూనివర్సిటీలో MBA సీటు సంపాదించాడు.అనంతరం ఓయూలో పీహెచ్‌డీ సీటు సాధించిన అర్జన్ బాబు ఒకవైపు పరిశోధన కొనసాగిస్తూనే మరోవైపు తెలంగాణ విద్యార్ధి ఉద్యమంలో మమేకమయ్యారు. విద్యార్థి దశ నుండే తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన, నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'లో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు (4080 కి.మీ) పూర్తిస్థాయిలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం పొందాడు.తన ఎదుగుదలకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, తన తల్లిదండ్రులకు మరియు గురువులకు అర్జున్ బాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. చదువుతో పాటు సామాజిక బాధ్యతలోనూ ముందుండటం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అర్జున్ బాబును ప్రశంసించారు.