పయనించే సూర్యుడు జనవరి 20 ముమ్మిడివరం బిజెపి అద్యక్షునిగా నితిన్ ఏకగ్రీవంగా ఎన్నిక పాలూరి సత్యానందం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షునిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో పాలూరి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు ఎంపిక కోసం నామినేషన్ ప్రక్రియ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది ఈ పదవికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జెపీ నడ్డా, నితిన్ గట్కరీ నేతల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది.. నితిన్ అభ్యర్దిత్వానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా భారీ మద్దతు తెలుపుతూ నామినేషన్లు వేశారు. ఇతరులు ఎవ్వరూ నామినేషన్ వేయకపోవడంరో జాతీయ రిటర్నింగ్ అధికారి. కె లక్ష్మణ్ ఏకగ్రీవంగా నితిన్ ఎన్నుకోబడ్డారని తెలిపారు.