మద్యం తాగి వాహనం నడపడంతో మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది..

★ అధికారులకు సూచనలు చేస్తున్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పయనించేసుర్యడు, జనవరి 20, రామగుండం మండలం (విద్యాసాగర్): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా, పెద్దపల్లి జోన్‌లోని మేడిపల్లి సెంటర్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది” అని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాహనదారులకు మద్యం మత్తులో డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన శిక్షలు (జరిమానాలు, జైలు, లైసెన్స్ రద్దు, సామాజిక సేవ), హత్యకు సమానమైన నేరం కింద కేసు నమోదు వంటి విషయాలపై వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్, ట్రాఫిక్ ఎస్సై హరీశేఖర్ తదితరులు పాల్గొన్నారు