పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 20, తల్లాడ రిపోర్టర్, మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం నందు మన తెలంగాణ 2026 నూతన క్యాలెండర్ ను మండల తహసీల్దార్ టి.కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేత పరిజ్ఞానంతో అగ్రగామిగా నిలిచి, ప్రజాభిమానం పొందిన మన తెలంగాణ తెలుగు దినపత్రిక భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.మన తెలంగాణ యాజమాన్యానికి సత్తుపల్లి నియోజకవర్గం పత్రికా జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ రెహమాన్, తల్లాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణరావు, గౌరవాధ్యక్షులు దుగ్గిదేవర అజయ్ కుమార్, షేక్ ముస్తఫా,అక్షరం రిపోర్టర్ సీతారాములు, మన తెలంగాణ రిపోర్టర్ గొల్లమందల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.