పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 20.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మాఘ పాడ్యమిన స్థానిక మృత్యుంజయశ్వర స్వామి అగ్రహారం మెట్టలో గల విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు సోమవారం ఆయా ఆలయాల్లో ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో అభిషేక ప్రియునికి వివిధ రకాల జలాలు పుష్పాలతో అభిషేకించి దేదీప్యమానంగా అలంకరించారు మాఘమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి పూజల్లో పాల్గొన్నారు భక్తిశ్రద్ధలతో ఆలయాల ప్రదక్షణ చేశారు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందించారు
