ముక్కాముల బేబీ సరోజిని దశదిన ఖర్మ కార్యా క్రమంలో పాల్గొన్న ప్రముఖులు..

పయనించే సూర్యుడు, జనవరి 20 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శేరిలింగంపల్లి నియోజకవర్గం మియా పూర్ డివిజన్ పరిధిలోని ముక్కాముల బేబీ సరోజిని ఇటీవల నిర్యాణం చెందారు. ఈ సందర్భంగా ఎస్ ఆర్ ఎస్టేట్ లో నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, బాలింగ్ యాదగిరి గౌడ్, మియా పూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు యలమంచి ఉదయ్ కిరణ్ వెంకటేశ్వ రరావు, మహేందర్ ముదిరాజ్, నాని, వంశీ, గోకినేపల్లి రమేష్, వినోద్, వినయ్ తదితరులు, అలాగే కుటుంబ సభ్యులు బాబ్జీ, వల్లభనేని సత్యనారాయణ, సుధీ ర్ బాబు కలిసి మియాపూర్ ఎస్ఆర్ ఎస్టేట్స్ ను సందర్శించి, పటానికి నివా ళులు అర్పించారు. శోకతప్త కుటుంబా నికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అండగా నిలిచారు. ఈ దుఃఖ సమయం లో కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం, శాంతి, మనోబలాన్ని ప్రసాదిం చాలని ప్రార్థించారు. ముక్కా ముల బేబీ సరోజిని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *