పయనించే సూర్యుడు జనవరి 20 నేరేడుచర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విచార వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలోని బీసీ కార్యాలయం బీసీ భవన్ లో బీసీ హక్కుల సాధన సమితి ముఖ్య నాయకులైన జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లుట్ల కనకయ్య జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ తో కలిసి పాత్రికేయలతో మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేవలం పదిహేడు శాతం మాత్రమే కేటాయించగా బీసీల చైతన్య వల్ల బీసీ ఉద్యమాల ఫలితం వల్ల రాష్ట్రంలో 50% స్థానాలు బీసీలు గెలుచుకోగలిగారని తమ పార్టీ తరఫున 42% బీసీలకు స్థానాలు కేటాయిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని, మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించకుండా మళ్లీ బీసీలను మోసం చేసిందని మున్సిపాలిటీలో సగం స్థానాలను బీసీలకు కేటాయించాల్సి ఉండగా నాలుగోవంతు స్థానాలు కూడా దక్కలేదని ఇది చైతన్యవంతమైన బీసీలు గమనంలో ఉంచుకోవాలని ఆయన కోరారు రాష్ట్రవ్యాప్తగా 121 మున్సిపాలిటీలోనూ, 2704 కౌన్సిలర్లు మరియు కార్పొరేటర్ లలో బీసీలకు 42 శాతం వాటా దక్కాల్సి ఉండగా కేవలం 31 శాతం మాత్రమే వాటా దక్కిందని దీని వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోయారని ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీల కంటే ఎస్టీ లకంటే బీసీలే ఎక్కువగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందించాల్సిన బాధ్యత ఉన్న పాలకులే బీసీలను మోసం చేస్తుంటే ఇక ఉపేక్షించేది లేదని బీసీలు మరింత చైతన్యవంతమై ఉద్యమాల బాట పట్టి రాజ్యాధికారం హస్తగతం చేసుకుంటే రాజ్యాధికారం చేతిలో ఉంటే అన్ని రకాల చట్టాలను అమలు చేసుకునే అవకాశాలు లభిస్తాయని అన్నారు