
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 బోధన్ :బోధన్ పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీ పంపిణీ చేసిన ప్రభుత్వ సలహా దారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా 690 మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల రాయితీ చెక్కు ఒక కోటి 99 లక్షల 27 వేల 257 రూపాయలను పట్టణంలోని మెప్మా మహిళా సంఘాల సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మెప్మా జిల్లా సమన్వయకర్త మాధురి లత, పట్టణ సమాఖ్య అధ్యక్షులు రఫియా సుల్తానా, మెప్మా పట్టణ సమన్వయకర్త శ్రీనివాస్, మెప్మా సిబ్బంది మరియు పట్టణంలోని వార్డుల మహిళా సంఘాల సభ్యులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.