పయనించే సూర్యుడు జనవరి 20 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని వట్టెం గ్రామపంచాయతీ మైనర్ల రక్షణే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించరాదని గ్రామంలోని కిరాణా దుకాణాల యజమానులకు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గ్రామ సర్పంచ్ జ్యోతి శంకర్, ఉపసర్పంచ్ వినీత్ స్పష్టంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పవన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో మైనర్లపై చెడు ప్రభావాలు పడకుండా నియంత్రణ చర్యలు చేపట్టామని గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.